హైదరాబాద్ అక్టోబర్ 18
నగరంలోని ఉప్పల్ కలాన్‌లో గల జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉప్పల్ చౌరస్తాలో అక్రమ మల్టీ ప్లెక్స్ నిర్మాణాలపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘మీ శాఖ బాగోతల మీద చర్యలు ఉంటాయా.. లేక మీరు అందులో భాగస్వాములా’’ అంటూ ప్రశ్నిస్తూ రేవంత్ ట్వీట్ చేశారు. అలాగే ఆధారాలను అటాచ్ చేస్తూ సీఎంఓకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు రేవంత్ టాగ్ చేశారు.