హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పధకాన్ని ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో నాలుగు పిటీషన్లు దాఖలు అయిన విషయం తెలిసిందే. సోమవారం నాడు హైకోర్టులో ఆ పిటిషన్ల సంబంధించి వాదనలు ముగిశాయి. తరువాత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటీషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్ అబ్యాన్ కొనసాగించే విధంగానే దళిత బంధు పథకాన్ని కూడా కొనసాగించాలని కోరారు. ఈ పథకాన్ని ఆపడం వల్ల చాలామంది వెనుకబడిన వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు. వెంటనే దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.