కౌతాళం
బెల్టుషాపులు నిర్వహిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని అక్రమంగా మద్యం అమ్మినా రవాణా చేసిన అక్రమంగా తరలించిన వారిని వదిలేది లేదని జిల్లా ఆదేశాలు మేరకే ఈ తనిఖీలు చెప్పట్టమని ఎస్సై మన్మథ విజయ్ తెలిపారు. మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో లో గంగోలి ఈరన్న అక్రమంగా మద్యం అమ్ముతుండగా ముమ్మరంగా దాడులు జరిపి వారి దగ్గర్నుంచి 96 కర్ణాటక స్వాధీనం చేసుకున్నారు. మరియు మేలిగానూరు నదిచగి గ్రామ మధ్యలో అక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా వారిపై తినిఖీలు చేయగా వారి వద్ద 20 కర్ణాటక మద్యం ప్యాకెట్లుఒక స్క్యూటీ ని మరియు చాకలి ఈరప్ప ,ఈశ్వరప్ప అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టు కు హాజరు పరుస్తామని తెలిపారు.ఈ విధి నిర్వహణలో సాయి, వలి, హుస్సేన్ వలి, చిన్న సిబ్బంది ఉన్నారు.