విద్యార్థులు చిన్నప్పటినుండి కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని చందుర్తి జడ్పిటిసి సభ్యులు నాగం కుమార్ అన్నారు. ఇటీవల వెలువడిన నవోదయ ఫలితాల్లో చందుర్తి నవోదయ పాఠశాల కు చెందిన కాసారపు అభినయశ్రీ ఉత్తీర్ణత సాధించడంతో చందుర్తి పాఠశాలలో బుధవారం అభినయశ్రీ కి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ మారుమూల మండలమైన చందుర్తి లో కార్పొరేట్ విద్య కు దీటుగా విద్యను బోధించడం అభినందనీయమన్నారు. చందుర్తి మండలం నుండి జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికవ్వడం మండలానికి గర్వకారణమన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం కూడా చందుర్తి మండలం నుండి విద్యార్థులు పట్టుదలతో చదివి అన్ని రంగాల్లో సీట్లు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభినయశ్రీ ని ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు. నర్సింగాపూర్ ఉపసర్పంచి శ్రీనివాస రెడ్డి. టిఆర్ఎస్ నాయకులు బైరగోని రమేష్ నవోదయ పాఠశాల కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.