తిరుమల,మా ప్రతినిధి,సెప్టెంబర్ 18,
టిటిడి బర్డ్ ట్రస్టుకు శనివారం రూ.1.10 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన బాలు రామజయన్ ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని అదనపు ఈవో బంగళాలో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి భక్తుడైన బాలు రామజయన్ ఇదివరకే టిటిడిలోని పలు ట్రస్టులకు విరాళాలు అందించారని, రెండు నెలల క్రితం ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయలు అందజేశారని తెలిపారు. కరోనా రెండో విడతలో బర్డ్ ఆసుపత్రికి అవసరమైన మందులను కూడా అందించారని చెప్పారు. ప్రస్తుతం బర్డ్ ట్రస్టుకు రూ.1.10 కోట్లు విరాళంగా అందించారని, ఈ మొత్తంతో 200 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యువల్ బెడ్ ఫైవ్ ఫంక్షన్ డీలక్స్ మంచాలు కొనుగోలు చేస్తామని వివరించారు. ఒక నెలలో ఈ మంచాలు కొనుగోలు చేసి బర్డ్ ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉంచుతామని, ఇవి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు. బాలు రామజయన్ కుటుంబానికి శ్రీవారు సంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.