Home జాతీయ వార్తలు దేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు

251
0

న్యూఢిల్లీ నవంబర్ 15
దేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,47,536కు చేరింది. ఇందులో 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,38,49,785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,63,655 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 125 మంది మరణించగా, 11,926 మంది వైరస్‌ నుంచి బయట పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.ప్రస్తుతం 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, గత 17 నెలల్లో ఇదే అతి తక్కువని తెలిపింది. అదేవిధంగా రికవరీ రేటు 98.26 శాతానికి చేరిందని, 2020 మార్చి తర్వాత అత్యధికమని పేర్కొన్నది. పాజిటివిటీ రేటు 1.12 శాతంగా ఉందని వెల్లడించింది.

Previous articleపిల్ల‌ల ర‌క్ష‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌త : స‌త్య‌వ‌తి రాథోడ్
Next articleవెలమలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here