ఎమ్మిగనూరు
పట్టణంలో జాతిపిత “మహాత్మా గాంధీ” గారి 152వ జన్మదినం పురస్కరించుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి శాసన సభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతో మొదలు కానీ, అన్నారు గాంధీజీ. ఏవైతే ఎదుటివారిలో వద్దు అనుకుంటామో వాటిని ముందు మనం పరిహరించుకోవాలి. “చెడు అనవద్దు వినవద్దు కనవద్దు” అన్నాడాయన. అసత్యం, అబద్ధం, ద్వేషం, మోసం, ద్రోహం, నేరం… ఇవి ఇప్పుడు పూర్తి చెడుకు కారణం అవుతున్నాయి. స్నేహం, త్యాగం, సమభావన, సహ జీవనం ఇవి విలువైనవిగా మారాయి. విలువలే మనుషుల్ని మహనీయులని చేస్తాయి. గాంధీజీని గౌరవించడం అంటే విలువల్ని కాపాడుకోవడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు, వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, సునీల్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగయ్య, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్, పాల శ్రీనివాస్ రెడ్డి, , టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.