న్యూఢిల్లీ అక్టోబర్ 9
దేశంలో కొత్తగా 19,740 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 248 మంది కరోనాకు బలవగా, 23,070 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కి చేరింది. ఇందులో 2,36,643 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,50,375 మంది మృతిచెందారు. 3,32,4,291 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. గతకొంతకాలంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో కేరళలోనే అత్యధికంగా ఉంటున్నాయి. అయితే రెండు వారాలుగా ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. దీంతో దేశంలో కూడా కరోనా కేసులు తుగ్గుతున్నాయి. కేరళలో శుక్రవారం 10,944 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇక వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు మాత్రమే ఉన్నాయి.