Home ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వంలోనే 2.28 లక్షల మంది అవ్వాతాతల పింఛన్ కట్ ఇది వైయస్ జగన్మోహన్...

వైకాపా ప్రభుత్వంలోనే 2.28 లక్షల మంది అవ్వాతాతల పింఛన్ కట్ ఇది వైయస్ జగన్మోహన్ రెడ్డికే తగునా టిడిపి నాయకులు షేక్ అబ్దుల్ అజీజ్

99
0

నెల్లూరు మా ప్రతినిధి. 2
28 లక్షల మంది అవ్వాతాతలకు పింఛన్ కట్ చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజెర్ల వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ
నిన్న దాదాపు 2.28 లక్షల మంది అవ్వాతాతల పెన్షన్ ను తీసేశారని అలా తీసేసిన ఘనత దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే దక్కుతుందని అన్నారు.అవ్వా తాతలు, వితంతువులు, ఆడపడుచులు, ఒంటరి మహిళలు వికలాంగుల కళ్ళల్లో నీరు తెప్పించడమే, నిన్న జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పెద్ద సంక్షేమం అని అన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన సంక్షేమాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతారు అన్న ఉద్దేశంతో ప్రజలు ఒక్క ఛాన్స్ అని జగన్ మోహన్ రెడ్డి ని గెలిపిస్తే ఆఖరికి అవ్వాతాతల పెన్షన్లు డబ్బులు కూడా తీసుకునే దుస్థితికి  వచ్చారు అని అన్నారు.2014 సమయంలో 200 గా ఉన్న పింఛన్లు ఐదు రెట్లు పెంచి 1000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదనీ, తరువాత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 1000 సరిపోదు 2000 పెంచుదాం అన్న ఆలోచనతో 2 వేల రూపాయలకు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది అన్నారు.
ఫిబ్రవరి 06, 2019 నాడు సమర  శంఖారావం పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 2000 కాదు 3000 అవసరమైతే 4వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చి అందరినీ మాయ చేశారని అన్నారు.
రాష్ట్రం ముందుకు నడవాలంటే సంక్షేమం అభివృద్ధి రెండు, రెండు కళ్ళలా ఉండాలని  పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని విమర్శించారు.చంద్రబాబునాయుడు  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకపక్క సంక్షేమం ఇంకోపక్క అభివృద్ధి ఇంకోపక్క ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి సంతకం తోనే తన అబద్ధాల చిట్టాను  ప్రారంభించారని, దఫాల వారీగా 250 పెంచుకుంటూ పోతాం అని చెప్పి  ఒక్క రూపాయి కూడా పెంచకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
ప్రతి అవ్వా తాత కి సంవత్సరానికి 750 రూపాయలు జగన్మోహన్రెడ్డి బాకీయా,  కాదా.? అని, ఆ లెక్కన మొత్తం 60 లక్షల మంది పింఛన్దారులకు 450 కోట్ల రూపాయలు జగన్మోహన్రెడ్డి బాకీ కాదా అని ప్రశ్నించారు.
అందరికీ పింఛన్లు పెంచి ఇవ్వాల్సింది పోగా, పెంచకపోగా 2.8 లక్షల మందికి పింఛన్లు తీసేశారని మండిపడ్డారు.
ప్రతి నెల పెన్షన్ తీసుకో పోతే పక్కన నెలలో పెన్షన్ ఇవ్వమని చెప్పి ఆ డబ్బులు కూడా మిగుల్చుకోవాలి చూస్తున్న ప్రయత్నం మంచిది కాదని అన్నారు.శవాలపై చిల్లర ఏరుకునే వారి కంటే ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పింఛన్దారులు ఇంట్లో ఉన్నా లేకపోయినా మూడు నెలల పాటు వారు తీసుకున్నా తీసుకోకపోయినా వారి మూడు నెలల పెన్షన్ డబ్బులు భద్రపరిచి వారికి జాగ్రత్తగా మూడో నెలలో అందించే వారని అన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి  పింఛన్ డబ్బు పక్కదారి పడుతుంది అని అంటున్నారని అంటే మీరు పెట్టిన వాలంటీర్లు దొంగలా అని ప్రశ్నించారు.బీటెక్లు ఎంటెక్లు చదివిన పిల్లలకు ఐదు వేలు ఇచ్చి గాడిద చాకిరీ చేయిస్తుంది కాక మరలా వారిని దొంగలుగా చిత్రీకరిస్తారా.? అని ప్రశ్నించారు.
ఊర్లో లేకపోతే పెన్షన్ ఆన్లైన్లో ఇవ్వచ్చు కదా.? లేకపోతే మరలా తీసుకోమని చెప్పచ్చు కదా.? అసలు డబ్బులు ఇవ్వమని చెప్పడం ఎంతవరకు న్యాయం అని అన్నారు.అసలు మీరు ప్రజలకు ఏంన్యాయం చేస్తున్నారు.? ప్రజలకు పులివెందుల న్యాయం చేయాలని అనుకుంటున్నారా? అని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి చేతగానితనం, చేతగాని పాలనతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి రెండో చేతితో తీసుకుంటున్నారని కారోనాతో చితికిపోయిన బ్రతుకుల్లో మరింత విషాదం నింపొద్దు అని అన్నారు.
మీరు పాదయాత్ర లో పెట్టిన ముద్దులనే ప్రజలు ఇంకా అరిగించుకోలేక పోతున్నారని మీరు పెట్టిన ముద్దుల వల్ల వారి నోటి దగ్గర ముద్ద లాగేయవద్దని అన్నారు.
8 నెలల క్రితం కేవలం నెల్లూరు జిల్లాలోనే దాదాపు తొమ్మిది లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేశారని మంజూరు చేసి స్థానిక ఎమ్మెల్యేలు చిరునవ్వులతో వారికి పత్రాలు అందించారని మీరు చిరునవ్వులతో అందించిన మంజూరు పత్రాలు ఏం అయ్యాయని అన్నారు.
పెన్షన్ కు పింఛను దరఖాస్తు చేసుకున్న కేవలం ఇరవై రోజుల్లో పెన్షన్ మంజూరు అవుతుంది అన్న జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఏమైంది అని ప్రశ్నించారు..

Previous articleసెప్టెంబ‌ర్ 17న థియేటర్స్‌లో ‘గ‌ల్లీరౌడీ’ సంద‌డి షురూ
Next articleపోలీస్ బోర్డు కే రక్షణ కరువు – ఇంకా ప్రజలకు ఎక్కడిది…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here