జగిత్యాల నవంబర్ 25
2021- 22 విద్యా సంవత్సరానికి గాను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జగిత్యాల జిల్లాలోని అన్ని వసతి గృహాలలో ప్రవేశాల కోసం సంబంధించిన కరపత్రాలను గురువారం జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కరపత్రంలో వసతి గృహాలు, ఖాళీల వివరాలు వసతి గృహంలో కల్పిస్తున్న వసతులు మొదలైన వివరించడం జరిగిందని , అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి, విద్యార్థినీ, విద్యార్థులు వసతి గృహాలలో ప్రవేశాలకు మీ దగ్గరలోని వసతి గృహ సంక్షేమాధికారిని సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, అలాగే ప్రతి వార్డెన్ స్థానికంగా ఉంటూ సమయపాలన పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే రాజ్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.