Home తెలంగాణ నవంబర్ 14-డిసెంబర్ 13 మధ్య నెల వ్యవధిలో 25 లక్షల వివాహాలు మరో సంవత్సరం లో...

నవంబర్ 14-డిసెంబర్ 13 మధ్య నెల వ్యవధిలో 25 లక్షల వివాహాలు మరో సంవత్సరం లో సుమారు 15 లక్షల జనాబా పెరిగే అవకాశం

141
0
Indian wedding ceremony. Weddings in India vary regionally, the religion and per personal preferences of the bride and groom. They are festive occasions in India, and in most cases celebrated with extensive decorations, colors, music, dance, costumes and rituals that depend on the religion of the bride and the groom, as well as their preferences

హైదరాబాద్ /విజయవాడ నవంబర్ 13
కరోనా మహమ్మారి కారణంగా.. దేశవ్యాప్తంగా.. వివాహాల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఒకటి రెండు పెళ్లిళ్లు జరిగినా.. వేలా మంది.. మాత్రం కరోనా నేపథ్యంలో తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండడంతో తిరిగి యథాతథ పరిస్తితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివాహాల ప్రక్రియ కూడా పుంజుకోనుంది.రేపటి నుంచి అంటే.. నవంబరు 14 నుంచి డిసెంబరు 13 వరకు మంచి రోజులు ఉండడంతో.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొంతకాలంగా వాయిదా పడుతున్న వివాహాలు జరిగే అవకాశం ఉంది. నవంబర్ 14-డిసెంబర్ 13 మధ్య కేవలం ఒక నెల వ్యవధిలో 25 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా.
ట్రేడర్స్ అసోసియేషన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) అంచనా ప్రకారం వివాహాల కారణంగా రూ. 3 లక్షల కోట్ల వ్యాపారం చేసే అవకాశం ఉంది. దీపావళి తర్వాత పరిమిత ముహూర్తాలు ఉండడం జనవరిలో శుభ దినాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు కలిసి వచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వధూవరులు రెడీ అవుతున్నారు. దీంతో కేవలం 30 రోజుల్లోనే లక్షలాది వివాహాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ఆంధ్రలో రాబోయే 30 రోజుల్లో కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు నిపుణులు.
రాబోయే రోజుల్లో మెజారిటీ కుటుంబాలు తమ పిల్లలకు కరోనా ప్రోటోకాల్ను అనుసరించి.. పెళ్లిళ్లు చేయనున్నాయి. కానీ వివాహ వేడుకలు జరిగే కళ్యాణ మండపాలు.. కిక్కిరిసిపోయే అవకాశం ఉండడం.. భౌతిక దూరం పాటించే అవకాశం లేకపోవడం.. వంటి కారణాలతో ప్రాణాంతక వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 రెండవ వేవ్ సమయంలో లాక్డౌన్ పరిమితులు శుభ ముహూర్తాలు అందుబాటులో ఉన్నప్పటికీ కుటుంబాలు వివాహాలను నిర్వహించకుండా నిరోధించాయి. ఇప్పుడు.. కరోనా తగ్గినప్పటికీ.. పలు దేశాల్లో డెల్టా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరని అంటున్నారు.CAIT ప్రకారం TS మరియు APతో సహా దేశవ్యాప్తంగా బాంక్వెట్ హాళ్లు హోటళ్లు రిసార్ట్లు ఫామ్హౌస్లు పెళ్లిళ్లకు సిద్ధమయ్యాయి. అనేక రాష్ట్రాలు వివాహాలకు 250 మందిని అనుమతించాయి. ఢిల్లీలో ఈ సంఖ్య 200కి పరిమితం చేశారు. ముంబైలో వివాహ వేదికలను 50% సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించారు. రాజస్థాన్లో 200 మంది అతిథులను అనుమతిస్తున్నారు. ఏపీలోనూ ఇటీవల 150 మందికి అనుమతిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కరోనా మూడవ దశ కేవలం హైప్ చేయబడిన అంశం మాత్రమే కాదు. అయితే దేశంలో పెళ్లిళ్లు పండుగ షాపింగ్ల పేరుతో ప్రజలు మార్కెట్లకు తరలి వస్తున్నందున వాస్తవానికి ఇది పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా 100 కోట్ల టీకా పూర్తయిన నేపథ్యంలో ఎక్కువ మంది వివాహాలకు హాజరయ్యే అవకాశం ఉంది. కానీ వాస్తవం ఏంటంటే.. జనాభాలో 70 శాతం మందికి రెండు డోసుల టీకా ఇంకా పూర్తి కాలేదు. దీంతో థర్డ్ వేవ్ ఖచ్చితంగా పెళ్లిళ్ల పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు పరిశీలకులు.అయితే.. ఈ వివాహాల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మరోసారి కోవిడ్ కేసులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. కాగా ఈ వివాహాల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మరో సంవత్సరం లో సుమారు 15 లక్షల జనాబా పెరిగే అవకాశం కుడా ఉంటుందని నిపుణులు పెర్కొంటున్నారు.

Previous articleసామాజిక స్పృహతో పని చేసేవారిని ప్రతినిధులుగాఎన్నుకోవాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Next article15న అన్ని రాష్ట్రాల ఆర్థిక,ముఖ్య మంత్రులతో నిర్మలా సీతారామన్ సమావేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here