Home జాతీయ వార్తలు 35 ప్రెజ‌ర్ స్వింగ్ అబ్జార్పాన్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను జాతికి అంకితం ...

35 ప్రెజ‌ర్ స్వింగ్ అబ్జార్పాన్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను జాతికి అంకితం త్వ‌ర‌లోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ : ప్ర‌ధాని మోదీ

151
0

న్యూ ఢిల్లీ అక్టోబర్ 7
పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ సంద‌ర్భంగా 35 ప్రెజ‌ర్ స్వింగ్ అబ్జార్పాన్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఆయ‌న జాతికి అంకితం చేశారు. ఇవాళ రిషికేశ్‌లో ఆయ‌న ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  త్వ‌ర‌లోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ మైలురాయిని చేరుకోనున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. కోవిన్‌ ఫ్లాట్‌ఫామ్ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టి ప్ర‌పంచానికి భార‌త్ ఓ మార్గాన్ని చూపించింద‌ని అన్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే వైద్య స‌దుపాయాలు క‌ల్పించి భార‌త్ త‌న సామ‌ర్థ్యాన్ని చాటింద‌న్నారు. మూడు వేల టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేశామ‌ని, మాస్క్‌ల‌ను దిగుమ‌తి చేసేవాళ్ల‌మ‌ని, కానీ ఇప్పుడు ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. అన్ని రంగాల్లో ఎగుమ‌తి చేసే దిశ‌గా భార‌త్ దూసుకువెళ్లుంద‌ని ప్ర‌ధాని చెప్పారు.దేశ‌వ్యాప్తంగా 92 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సూక్ మాండ‌వీయ తెలిపారు. ఇక ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో 95 శాతం మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Previous articleసీఎం,మంత్రిని కలిసిన వైరా మాజీ ఎమ్మెల్యే
Next articleఎంత మందిని అరెస్ట్ చేశారు? శుక్ర‌వారం నివేదిక‌ను స‌మ‌ర్పించండి యూపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here