ములుగు నవంబర్ 24
కార్పొరేట్ స్థాయికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వసతులతో నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించే దిశగా వైద్యాధికారులు వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో పనిచేయాలని ఆసక్తి చూపే గైనకాలజిస్టు లకు వారి సేవలను గుర్తించి అడిషనల్
అలవెన్స్ ఎస్ ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
బుధవారం రోజున ములుగు జిల్లా ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ఆధ్వర్యంలో సంబంధిత వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు నియమించుట, స్టాఫ్ నర్సులు నియామకం జరిగిన తర్వాత ఎంతమంది రిపోర్ట్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ పూర్తిస్థాయిలో ఉన్నారా లేదా ఆసుపత్రి మౌలిక వసతులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పై చర్చించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక మొత్తంలో సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని, వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అన్ని వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టులు( డాక్టర్స్) నియామకం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అలాగే ఏరియా ఆసుపత్రి శానిటేషన్ సమస్యలు తలెత్తడం వల్ల ప్రస్తుతం ఉన్న ఏజెన్సీని రద్దు పరిచే విధంగా చర్యలు తీసుకుంటూ, కొత్త ఏజెన్సీకి శానిటేషన్ అప్పజెప్పాలని ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ జగదీష్ ను ఆదేశించారు, సెక్యూరిటీగార్డుని నియమించి నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎంట్రీ ,ఎగ్జిట్ ఎవరెవరు వస్తున్నారు, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఏమి జరుగుతున్నాయో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.అలాగే గట్టమ్మ దేవాలయం పరిసర ప్రాంతం లో ప్రభుత్వం నూతనంగా కలెక్టర్ కార్యాలయం నిర్మాణంలో ఉన్న దగ్గరలో కొత్త ఏరియా ఆసుపత్రి నిర్మాణం కొరకు పది ఎకరాల స్థలం కేటాయిస్తూ 40 కోట్ల నిధులు మంజూరు చేసిందని అందులో 10 కోట్లు ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరకు కేటాయించిందని అన్నారు. కోవిడ్ కారణంగా చనిపోయిన వారికి ప్రభుత్వపరంగా అందించే సహాయ సహకారాలు పై జిల్లాలో ఇప్పటివరకు100
దరఖాస్తులు వచ్చాయని వారు అందించిన ధరఖాస్తు ఆధారంగా ఆయా గ్రామాల్లో మెడికల్ ఆఫీసర్ పరిశీలన చేయాలన్నారు. ఏ గ్రామంలో అయినా కోవిడ్ కారణంగా ప్రజలు మరణించినట్లయితే సంబంధిత ఏఎన్ఎం, ఆశా కార్యకర్త దగ్గర వివరాలు ఉండాలన్నారు. టి ఎస్ ఎమ్ ఐ డి సి నుంచి మందులు సప్లై లేనిపక్షంలో ప్రైవేట్ నుంచి కొనుగోలు చేయాలని కార్పొరేట్ స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పించుకోవాలి అని అన్నారు.
కోవిడ్ కారణంగా ప్రజలను రక్షించడం కొరకు వ్యాక్సినేషన్ అందించడం వైద్యాధికారులు ఆశా ఏఎన్ఎంలు బాగా పని చేశారని వారిని అభినందించారు హెల్త్ అవేర్నెస్ క్యాంపు కండక్ట్ చేసి
వారి సేవలు గుర్తించాలన్నారు. ఆసుపత్రిలో పార్కింగ్ విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని , సరిచేసుకోవాలని వైద్య చికిత్సలకు కాకుండా ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఆసుపత్రి ప్రాంగణంలో అడుగు పెట్టిన యెడల సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి కి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని
ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో శక్తివంచన లేకుండా పని చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీష్ ఏటూర్ నాగారం సి హెచ్ ఎస్ సూపరిండెంట్ డాక్టర్ సురేష్, డి సి హెచ్ ఎస్ జాన్సన్ సంబంధిత ఏరియా ఆస్పత్రి వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.