మందమర్రి. అక్టోబర్ 22
జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సింగరేణి లోకి నూతనంగా 44 మందికి కారుణ్య డిపెండెంట్ లకు ఉద్యోగాల నియామకాల ఉత్తర్వుల పత్రాలను శుక్రవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు వరకు మందమర్రి ఏరియా లో 1148 కారుణ్య పత్రాలను అందజేయడం జరిగిందన అన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న ఉద్యోగులు సర్ఫేస్ లో లైట్ జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా 4, 5 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లో పని చేయాలని అలాగే గైర్హాజరు చేయకుండా ఉద్యోగం చేసుకోవాలని అన్నారు. అలాగే తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ సింగరేణి లాభాల బాటలో తీసుకు రావడానికి కృషి చేయాలని అన్నారు.
సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చాలని క్రమశిక్షణతో ఉద్యోగ ధర్మాన్ని పాటించి వృద్ధిలోకి రావాలని సూచించారు. ముఖ్యమంత్రి కే సీ ఆర్ కృషితోనే ఉద్యోగాలు వచ్చాయి అని దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో కారుణ్య నియామకాలు కొనసాగడం లేదని, సింగరేణిలో రెండవ తరానికి ఉద్యోగాలు రావడం అదృష్టంగా భావించాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ సత్యనారాయణ, టిబిజికెఎస్ స్ట్రక్చర్ కమిటీ మెంబర్ శంకర్రావు ,సిఎంఓఎఐ అధ్యక్షుడు జక్కా రెడ్డి, ఇన్చార్జి పిఎం శ్యాంసుందర్, సీనియర్ పివోలు మైత్రేయ బంధు, ఆసిఫ్, ఓఎస్ రాయ లింగు సిబ్బంది పాల్గొన్నారు