Home తెలంగాణ కృష్ణా జ‌లాల్లో 50 శాతం వాటా ఇవ్వల్సిందే: తెలంగాణా

కృష్ణా జ‌లాల్లో 50 శాతం వాటా ఇవ్వల్సిందే: తెలంగాణా

315
0

హైద‌రాబాద్ అక్టోబర్ 12
సోమాజిగూడ‌లోని జ‌ల‌సౌధ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు(కేఆర్ఎంబీ) స‌మావేశం అయింది. కేఆర్ఎంబీ చైర్మ‌న్ ఎంపీ సింగ్ అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన నీటిపారుద‌ల శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లుపై చ‌ర్చించ‌నున్నారు. ఉమ్మ‌డి ప్రాజెక్టుల‌ను బోర్డు ప‌రిధిలోకి తెచ్చే అంశంతో పాటు ఉప సంఘం నివేదిక‌పై కృష్ణా బోర్డు స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యే కంటే ముందు తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జ‌లాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం. ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ ఎలా చేస్తార‌ని అడుగుతున్నాం? ఇవాళ్టి స‌మావేశం త‌ర్వాత ప్ర‌భుత్వానికి నివేదిక ఇస్తాం. బోర్డు ప‌రిధిలోకి ఏ ప్రాజెక్టులు ఇవ్వాల‌నేది చ‌ర్చిస్తామ‌న్నారు. కృష్ణా జ‌లాల విష‌యంలో తెలంగాణ‌కు వాటా పెర‌గాలి. న‌దీ ప‌రివాహ‌క ప్రాంతం తెలంగాణ‌లో అధికంగా ఉంది. నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగ‌ర్, క‌ల్వ‌కుర్తి ప్రాజెక్టుకు నిక‌ర జ‌లాలు కేటాయించాలి. వాటా ప్ర‌కారం తెలంగాణ‌కు 570 టీఎంసీలు కేటాయించాలి. కొత్త ట్రిబ్యున‌ల్ వ‌చ్చే వ‌ర‌కు మ‌రో 105 టీఎంసీలు ఇవ్వాల‌న్నారు. బోర్డు ప‌రిధిలో విద్యుత్ ప్రాజెక్టులూ ఉండాల‌ని కోరుతున్నారు. తెలంగాణ‌లో అనేక ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో నీటి వాటాతో పాటు విద్యుత్ ఉత్ప‌త్తి కూడా త‌మ‌కు ముఖ్య‌మని స్ప‌ష్టం చేశారు. ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు, బోరుబావుల‌కు విద్యుత్ ఉత్ప‌త్తి చేయాలి అని ర‌జ‌త్ కుమార్ డిమాండ్ చేశారు.

Previous articleఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల్లో అగ్రగామిగా నిలిచిన టీఆర్ఎస్!
Next articleక‌రోనా వ్యాక్సినేష‌న్‌లో ఇండియా మ‌రో మైలురాయి 2-18 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య పిల్ల‌ల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్న‌ల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here