Home తెలంగాణ మహబూబ్‌నగర్‌ శాసన మండలి సభ్యుల ఎన్నికలలో6 నామినేషన్లు తిరస్కరణ

మహబూబ్‌నగర్‌ శాసన మండలి సభ్యుల ఎన్నికలలో6 నామినేషన్లు తిరస్కరణ

102
0

మహబూబ్‌నగర్‌ నవంబర్ 24
మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో 4 నామినేషన్లు ఆమోదం పొందగా 6 తిరస్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు వెల్లడించారు.బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఇ. శ్రీధర్, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావు నామినేషన్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల (2) పదవుల ఎన్నికకు గాను మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 4 నామినేషన్లు ఆమోదించగా.. తక్కిన 6 గురి నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఆమోదించిన నామినేషన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నామినేషన్ లతోపాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులవి ఉన్నట్లు తెలిపారు. అవి ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి కావలి శ్రీశైలం, నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం కొండ్రావు పల్లికి చెందిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సుధాకర్ రెడ్డి నామినేషన్లు కూడా ఉన్నాయి.స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సార బాయి కృష్ణ, షేక్ రహీం పాషా, మహ్మద్‌ గౌస్, సంద రేణుక, బెజ్జం మల్లికార్జునరావు, మంతటి రామాంజనేయులు నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Previous articleకొవిడ్‌-19 బారిన‌ప‌డి మ‌ర‌ణించిన వారి వాస్త‌వ గ‌ణాంకాలు బ‌య‌ట‌పెట్టాలి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్
Next article2022 మార్చి వ‌ర‌కూ ఉచిత రేష‌న్ ప‌ధ‌కం పొడిగింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here