కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి సెప్టెంబర్ 16
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన 35 మంది యువకులను బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానం పలకడం జరిగింది.మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 38మంది యువకులు బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించడం జరిగింది.గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరణ అనంతరం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ అభివృద్ధి కి ఆకర్షితులై, రాష్ట్ర రథసారథి బండి సంజయ్ న్యాయకత్వములో పని చేయటానికి తన పై నమ్మకంతో బీజేపీ లో చేరిన ప్రతి యువకుడికి 24 గంటలు అందుబాటులో ఉంటానని, రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి లో బీజేపీ కాషాయ జండా ఎగర వేసి దొర ప్రభుత్వానికి మొదటి పతనం కామారెడ్డి నుండే ప్రారంభిస్తామని అన్నారు. ఈ నెల 22 న మాచారెడ్డికి వస్తున్న బండి సంజయ్ గారి మహా సంగ్రామ యాత్ర సభకి సంఘీభావంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.