నంద్యాల
నంద్యాల పట్టణంలోని ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం నాడు శ్రీ శ్రీ శ్రీ శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజి వారి దివ్య మంగళ శాసనముల తో 77వ విశ్వ శాంతి మహా యాగ మహోత్సవ కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ కాలచక్ర మహోత్సవం 14 రోజులపాటు మన నంద్యాల పట్టణంలోని ప్రథమానందిశ్వర దేవస్థానం లో చేయడం మన అందరి అదృష్టం భావిస్తున్నానని ఆయన అన్నారు. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యాగం జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అలాగే స్వామి వారిని కూడా మా నంద్యాల నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని నంద్యాల ఇంకా డెవలప్ మెంట్ జరగాలని రైతు అందరూ మంచి పంటలు పండించి మరింత ఆనందంగా ఉండేలా మనసారా ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.