బెల్లంపల్లి నవంబర్ 19
బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయం ఆవరణలో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ ప్రెస్ మీట్. మావోయిస్టుల పేరుతో కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తొమ్మిది మంది అరెస్టు, ఒకరు పరారీలో ఒకరు, పాత కేసులో జైలు లో ఒకరు ఉన్నట్లు వివరాలు వెల్లడించారు.
మంచిర్యాల గద్దరాగడి చెందిన అంజి బాబు తాళ్ల గురిజాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం బెల్లంపల్లి కాల్ టెక్స్ ప్లై ఓవర్ బ్రిడ్జి పై ఉదయం తెలుకుంట్ల బిక్షపతి ని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టారు, భిక్షపతి చేసిన నేరాలు ఒప్పుకున్నారు. అందులో నకిలీ బంగారు దేవత విగ్రహం ను అసలైన విగ్రహంగా నమ్మించి మోసం చేసి డబ్బులు వసూళ్లు చేయడం,డమ్మీ తుపాకులతో బెదిరింపులు గురిచేసారని వారి దగ్గర నుంచి . రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్,డమ్మీ పిస్టల్స్ రెండు,ఎయిర్ గన్ ఒకటి,డమ్మీ రివాల్వర్ ఒకటి, 7.65 ఎం.ఎం లైవ్ రౌండ్ , 7.65 ఎంఎం. ఖాళీ రౌండ్ కేస్ ఒకొక్కటి,హుందాయి ఐ20,స్కూటీ.రెండు తల్వార్లు, వాకి-టాకీ లురెండు, రెండు చార్జర్ లు ,మావోయిస్టు లెటర్ పాడ్ పేపర్లు 50, మొబైల్ ఫోన్లు ఏడు పాకెట్ బుక్,చిన్న నోట్ బుక్ ఒకటి నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో తెలుకుంట్ల బిక్షపతి, వడ్లకొండ రాజ్ కుమార్,
మహమ్మద్ మతీన్ అలీ, మోటమర్రి ప్రదీప్ కుమార్,రాగుల రాజశేకర్, తుంగ క్రాంతి కుమార్, పునీత్ భారతి, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ అఫ్జల్, పరారీ లో రాగుల తిరుపతి ,
అన్ని కేసులో సలహాలు సూచనలు చేస్తున్న ముఖ్య సూత్రధారి అందుగుల శ్రీనివాస్,ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంటాయి అని అన్నారు.
నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన బెల్లంపల్లి ఎసిపి ఎ మహేశ్, సీఐ కె. జగదీష్, , తాల్లగురిజాల ఎసై బి.సమ్మయ్యఎన్. ఎసై రమాకాంత్, పిఎసై లు రవి కిరణ్, గంగాధర్, విక్రమ్, సిబ్బంది వెంకటేష్, లవన్ కుమార్, మల్లేశ్, వినోద్, ప్రవీణ్, శ్రీనివాస్, సుభాష్, విజయ్, రఫీ, మురళి, నెన్నెల సిబ్బంది కృష్ణ, ప్రశాంత్, శ్రీకాంత్, వీరికి సహకరించిన సైబర్ సెల్ కానిస్టేబుల్ లను రామగుండం పోలీసు కమిషనర్ ఎస్.చంద్ర శేఖర్ రెడ్డి, అభినందించారు.