Home నగరం జైలులో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ 24 మంది ఖైదీలు మృతి

జైలులో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ 24 మంది ఖైదీలు మృతి

78
0

న్యూ డిల్లీ సెప్టెంబర్ 29
ఈక్వెడార్‌లోని గుయాక్విల్ జైలులో రెండు వర్గాల మధ్య ఘర్షణ 24 మంది మృతి కి దారితీసింది. జైలులో రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన వివాదం తో బాంబులు, తుపాకులతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దీంతో 24 మంది ఖైదీలు మృతిచెందారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 24 మంది ఖైదీలు మృతి చెందారు. మరో 48 మందికిపైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.రంగంలోకి దిగిన సైనికులు, పోలీసులు అల్లర్లను అదుపు చేయడానికి 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. కాగా ఈక్వెడార్‌లోని మూడు జైళ్లలో గత ఫిబ్రవరిలో జరిగిన ఘర్షనల్లో 79 మంది మరణించారు. జూలైలో జరిగిన మరో ఘటనలో 22 మంది ఖైదీలు మృతిచెందారు.

Previous articleఅక్టోబర్ 8న రిలీజ్ అవుతున్న ‘నేను లేని నా ప్రేమకథ’
Next articleమ‌లాశ‌యంలో రు.42 ల‌క్ష‌ల బంగారం పేస్ట్‌..అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here