నెల్లూరు
నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ దారుల విజ్ఞప్తి మేరకు మరో 15 రోజుల పాటు 75 శాతం మైక్రాన్ పైన ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయాలకు అనుమతి ఇచ్చామని, నవంబర్ 1 వ తేదీ నుంచి నగరంలో ప్లాస్టిక్ ఉత్పత్తులపై పూర్తి స్థాయి నిషేధం విధిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం విలేకరులతో కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 4వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విక్రయాలకు అనుమతులు ఇస్తూ నగరంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించామని, అయితే తయారీ దారుల వద్ద మిగిలి ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయాలకు ఈ నెల చివరి వరకు అనుమతులు ఇచ్చామన్నారు. నవంబర్ 1 వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ ల ద్వారా కఠిన ఆంక్షలతో కూడిన భారీ జరిమానాలను విధించనున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.