Home తెలంగాణ లంబసింగిలో కాల్పుల కలకలం

లంబసింగిలో కాల్పుల కలకలం

271
0

చింతపల్లి
విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగిలో కాల్పుల కలకలం రేగింది. గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు నల్గొండకు చెందిన పోలీసులు ఏజెన్సీ ప్రాంతాని వెళ్లారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొయ్యూరు మండలం తులబాయిగడ్డ వద్ద ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లు స్మగ్లర్ల కోసం గాలిస్తుండగా… 20 మంది గంజాయి స్మగ్లర్లు నల్గొండ పోలీసులకు ఎదురుపడ్డారు. పోలీసుల కదలికలను గమనించిన స్మగ్లర్లు రాళ్లదాడి చేయడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో గంజాయి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో కామరాజు, రాంబాబుకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ నర్సీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఏవోబీ లంబసింగి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది.

Previous articleఫ్యాబ్‌వీవర్స్ స్వదేశ్ LLP 10/15/2021
Next articleమంటల్లో ప్రైవేటు బస్సు దగ్దం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here