కరీంనగర్
మర్కజి మీలాద్ కమిటీ కరీంనగర్ పాలక వర్గానికి బుధవారం రాత్రి హుస్సేనీ పుర బొంబాయి స్కూల్లో ఆత్మీయ సత్కారం జరిగింది.
మహనీయ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక సదస్సులు, వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని కమీటీ అధ్యక్షుడు ముఫ్తి అలీమోద్దీన్ నిజామీ బుధవారం తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ కోసం పనులు ముమ్మరం చేస్తున్నామన్నారు. తమకు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో మిలాద్ కమిటీ ఉపాధ్యక్షుడు బొంబాయి బాబా ఫరీద్,ప్రధాన కార్యదర్శి గులాం రబ్బానీ ఖాద్రి శంసి, సహాయ కార్యదర్శి గౌసోద్దీన్ ఖాద్రి, కోశాధికారి వలి పాషా, కార్యవర్గ సభ్యులు సోహైల్ రజా, హాజీ భాయ్, మౌలాన నఖీబ్ రజా, మౌలాన సయ్యద్ షా మహమ్మద్ ఖాద్రి, సమద్ నవాబ్, రామంచ దర్గాహ్ ఖాదీమ్ కరీంఖాన్, అంజద్ ఖాన్ ముజ్జు తదితరులు పాల్గొన్నారు.