Home తెలంగాణ శ్రీ జయాగౌరి వ్రత క్రతువు కి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనలి

శ్రీ జయాగౌరి వ్రత క్రతువు కి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనలి

129
0

కామారెడ్డి అక్టోబర్ 29:
కామారెడ్డి జిల్లా పిట్లం:
నవంబర్ నెల లో సంగారెడ్డి లోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం లో జరిగే శ్రీ జయాగౌరీ వ్రత క్రతువు లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యా పీఠం సిద్ధాంతి  మహేశ్వర శర్మ సిద్ధాంతి కోరటం జరిగింది . శుక్రవారం నాడు పిట్లం మండల కేంద్రంలోని సాయిబాబా మందిరం లో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి నిర్వహణలో ప్రతి సంవత్సరం కూడా వైభవ్ ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని  అందులో అంతర్భాగంగా మహిళ మహోన్నతి  కోసం ఒక దివ్య వ్రతాన్ని ఆచరణ చేస్తూ గత 8 సంవత్సరాల కాలంగా ఈ వ్రతం నిర్వహణ జరుగుతూ ఉందని ఈ సంవత్సరం కార్తీక శుద్ధ పంచామ్యా జయావ్రతం అనుత్తమమం అనేటువంటి నారదా పురాణవచనం ద్వారా విశేషించి నటువంటి యువతరంలో జయ గురుదత్త సుమారు 1800 మంది మహిళా మూర్తులు చేత ఏక కాలంలో అతి వైభవంగా నవంబర్ 9వ రోజు ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహణకు విద్యాపీఠం సంకల్పించడం జరిగింది . ఇందులో అంతర్భాగంగా పిట్లం లో సభ్యుల బృందంలో  మహిళలు ఆధ్యాత్మిక  చైతన్యం కలిగించాలని ఆహ్వానించడం జరిగింది అని తెలిపారు . ఇటువంటి వ్రతం చేసుకోవడం చాలా అదృష్టం అని తెలిపారు . మహిళలు సౌభాగ్యం కోసం వ్రతం చేయాలి , అదే విధంగా ప్రాయచ్చిత్తం కోసం , ధామ్యముల కోసం చేయాలి  ఈ మూడింటి ఫలితమే ఈ జయా గౌరి వ్రతము అందజేస్తుందని  అని తెలిపారు . అందుకే ఈ వ్రతాన్ని వ్రత రాజ్యము అన్నారు .ఈ వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని  జయాగౌరీ నీ అర్చించి సకల శుభాలు పొందాలనే గొప్ప సంకల్పంతో ఈ వ్రతాన్ని విద్యాపీఠం ఆచరణ చేస్తుందని  తెలిపారు . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , భక్తులు పాల్గొన్నారు .

Previous articleగంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి – పెద్దపల్లి డీసీపీ రవీందర్
Next articleఎమ్మెల్యే కోటంరెడ్డి ని సత్కరించిన రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు చక్రధారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here