Home జాతీయ వార్తలు లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతుల పేరిట స్మారకం

లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతుల పేరిట స్మారకం

109
0

ఘజియాబాద్‌
లఖింపూర్‌ ఖేరీ ఘటనలో మరణించిన రైతుల పేరిట స్మారకం నిర్మించేందుకు ఢిల్లీ సిక్కు గురుద్వారా ఘటన జరిగిన ప్రాంతంలోనే ఐదుగురి విగ్రహాలను ఏర్పాటు చేసి వారి గురించి వివరాలు చెక్కించాలని కమిటీ నిర్ణయించినట్లు గురుద్వారా కమిటీ అధ్యక్షుడు మంజీందర్‌ సింగ్‌ సిర్సా తెలిపారు. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో ఈ స్మారకం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో సరిగ్గా పది రోజుల క్రితం జరిగిన హింసలో ఐదుగురు రైతులు చనిపోయారు.టికునియాలో దాదాపు ఒకే చోట అమరవీర రైతుల స్మారక చిహ్నం నిర్మించనున్నామని, అక్కడ నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ అమరులయ్యారని మంజీందర్‌ సింగ్‌ సిర్సా చెప్పారు. ఇందు కోసం ఒకటిన్నర, రెండు ఎకరాల భూమి అవసరం అవుతుందని, స్థానిక భూ యజమానులతో మాట్లాడి కొనుగోలు చేస్తామన్నారు. లఖింపూర్‌ ఖేరీలో ఐదుగురు రైతుల విగ్రహాలతోపాటు మొత్తం సంఘటనను చెక్కించేందుకు నిర్ణయించామని ఆయన వెల్లడించారు. ఈ మొత్తం ఖర్చును ఢిల్లీ గురుద్వారా చెల్లిస్తుందని, ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోమని చెప్పారు.ఇప్పటివరకు టికునియాతోపాటు మీరట్, ఘాజీపూర్ సరిహద్దులో రైతు స్మారక చిహ్నాలను నిర్మించనున్నట్లు రైతు నేతలు ప్రకటించారు. గత ఏప్రిల్‌లో ఘాజీపూర్‌ సరిహద్దులో మేధా పాట్కర్‌తో కలిసి రాకేశ్‌ తికాయత్‌ స్మారకం నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేయడం విశేషం.

Previous articleప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే పీడీ యాక్టు
Next articleపూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెప్పిన ‘రాధే శ్యామ్’ టీం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here