Home తెలంగాణ తెలంగాణ తొలి అమరుడు పోలీసు కిష్టయ్యకు ఘనంగా నివాళి

తెలంగాణ తొలి అమరుడు పోలీసు కిష్టయ్యకు ఘనంగా నివాళి

272
0

జగిత్యాల, డిసెంబర్ 02
దాన్యాన్ని తీసుకోని కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  చూడాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.   గురువారం బుగ్గారం మండలం లోని యశ్వంతరావు పేట, గోపాలపురం, వెల్గటూర్ మండలంలోని కిషన్  రావుపేట, ఎండపల్లి గ్రామలలో ఏర్పాటుచేసిన ఐకేపీ సెంటర్లను మరియు బుగ్గరం మండలం మద్దునురు, సిరికొండ, ధర్మపురి మండలం తిమ్మాపూర్, నెరేళ్ల గ్రామలలో ఏర్పాటు చేసిన పి.ఏ.సి.ఎస్ కేంద్రాలలో ఆకస్మీక తనిఖీ నిర్వహించారు.
ధర్మపురి ఏ.ఎం.సి లలో సెంటర్ లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలులో వేగం పెంచాలని సెంటర్ ఇంఛార్జిలను ఆదేశించారు.

నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ  17% తేమశాతం ఉన్న దాన్యాన్ని మాత్రమే కోనుగోలు చేయాలని,
దాన్యాన్ని కొనుగోళు పూర్తిచేసిన వెంటనే లారీల ద్వారా మిల్లులకు తరలించాలని, అవసరాన్ని బట్టి ఎక్కువ మంది కూలీలను వినియోగించుకోవాలని తెలిపారు.  దాన్యం రవాణాలో ఇబ్బందుల తలెత్తకుండా రవాణా త్వరగా పూర్తయ్యేలా కోనుగోలు కేంద్రం వారిగా అవసరం మేర లారీలను వినియోగించాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం  కొనుగోలు కేంద్రాలకు దాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులుకు ఆదేశాలు జారీచేశారు. కేంద్రాలలో నిర్వహిస్తున్న పలు రిజిస్టర్లు తనిఖీ చేసి. తూకంలో, మిల్లులలో దాన్యం తరలింపు, దిగుమతిలో  అలస్యం జరగకుండా ప్రతి కేంద్రం, మిల్లుల వారిగా పరిశీలిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు.

ఈ పర్యటనలో డి.సి.ఎం.ఎస్. చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్ఓ పిడి వినోద్, డి.సి.ఎస్.ఓ చందన్ కుమార్, డి.ఎం.మార్కెటింగ్ ప్రకాశ్, డి.సి.ఓ రామానూజా చారి, ఎం.పి.డి.ఓ.లు., తహసీల్దార్లు  సర్పంచులు స్థానిక ప్రజా ప్రతినిధులు సింగిల్విండో చైర్మన్ ఎం సి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు

Previous articleతెలంగాణ తొలి అమరుడు పోలీసు కిష్టయ్యకు ఘనంగా నివాళి
Next articleధాన్యం సేక‌ర‌ణ బాధ్య‌తను విస్మ‌రిస్తోన్న కేంద్రం :నామా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here