పెద్దపల్లి డిసెంబర్ 02
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రామగుండం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి తూడి రాజయ్య ఆధ్వర్యంలో బుధవారం రాత్రి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ ఉద్యమ కెరటం మలిదశ పోరాటంలో తొలి అమరుడు అసువులు బాసిన పోలీసు కిష్టయ్య ముదిరాజ్ ఘనంగా నివాళులర్పించారు. పరాయిపాలనలో తెలంగాణ విద్యార్థులకు,పోలీసులకు అన్యాయం జరుగుతుందని ఆవేదనతో తెలంగాణ ఉద్యమం ఉవ్వేత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఉస్మానియా యూనివర్శిటి విద్యార్థులపై పోలీసుల దాడులు సహించలేక, ఉద్యమానికి నేనూ సమిధనవుతానంటూ తెలంగాణ సాధించేందుకు తమిళ్ తొలి అమరుడైన పోలీసులు తనను స్మరించుకోవడం తెలంగాణ సమాజ బాధ్యతగా ముదిరాజ్ కులస్తులు ఎప్పుడు స్మరించుకుంటారని, పోలీసు కిష్టన్న చిత్రపటానికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. లోఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దబ్బెట శంకర్, పిట్టల అంజయ్య, బొజ్జ రాజనర్సు, బోయిని కుమార్, జెట్టి రాము, నిరటి రమేష్, భిక్షపతి, ముదిరాజ్ నియోజకవర్గ యూత్ ఇంచార్జ్ చిట్టవేణి వేణు పాల్గొన్నారు.