Home ఆంధ్రప్రదేశ్ కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కి ఘన స్వాగతం

కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కి ఘన స్వాగతం

78
0

జగ్గయ్యపేట
కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కి ఘన స్వాగతం లభించింది. అమరావతి రైతులు సోమవారం నుంచి తలపెట్టనున్న  ‘న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర’కు రేణుకా చౌదరి మద్దతు తెలిపారు.  సోమవారం పాదయాత్రకు వెళ్తూ మార్గ మధ్యలో చిల్లకల్లు లో ఆమెకు అమరావతి జేఏసీ నేత సుంకర పద్మశ్రీ, నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్నాటి అప్పారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు దాచేపల్లి వీరభద్రరావు తదితరులు ఘన స్వాగతం పలికారు.  రేణుకా చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం ఏమి చేసినా చేతికి వేసుకుంది గాజులు కాదు  విష్ణు చక్రాలు అంటూ చురకలు వేసారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి వెళ్తున్నా. రైతులు దేశానికి వెన్నెముక. అలాంటి రైతులను ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోంది. అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. నేను సైనికుడి కూతురిని…దేశంలో ఎక్కడైనా పర్యటిస్తా…నాకు భయం అంటే ఏంటో తెలియదు. అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎపుడు మద్దతుగా ఉంటుందని అన్నారు.
అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర అమోఘం. మహిళల చేతులకు ఉన్నవి గాజులుకావు,విష్ణు చక్రాలు. ఓటుతో ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు మహిళలు. రైతులు రోడ్డెక్కే పరిస్థులు తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. సాటి మహిళలుగా నాకు బొట్టుపెట్టేందుకు మహిళలు వస్తే పోలీసులు అడ్డుకోవడం మంచి పద్దతికాదు. రేణుకా చౌదరి అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు? ఏపీ లో గల్లీ… గల్లీ…ఎపుడో తిరిగానని అన్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్  పలువురు నాయకులు, కార్యకర్తలు కుడా ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

Previous articleఅక్రమ నిర్మాణాల కూల్చివేత
Next articleబిల్డర్ దారుణ హత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here