Home తెలంగాణ ఉద్యమంలా ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలి

ఉద్యమంలా ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలి

121
0

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల, సెప్టెంబర్ 18
జిల్లాలో ఉద్యమంలా ప్రత్యేక  కరోనా వ్యాక్సినేషన్  కార్యక్రమం నిర్వహించాలని   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్  సంబంధిత అధికారులను ఆదేశించారు.   జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్  పై  మంత్రి శనివారం  ప్రజాప్రతినిధులు,  సంబంధిత అధికారులతో జూమ్ వీడీయో  కాన్పరెన్సు ద్వారా సమీక్షించారు.సీఎం కేసిఆర్ ఆదేశాలతో  తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసామని  మంత్రి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలో వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా  సీఎం కేసిఆర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారని   తెలిపారు. ప్రభుత్వం  చేపట్టిన  ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయడంలో ప్రజాప్రతినిధలు కీలక పాత్ర పోషించాలని  మంత్రి సూచించారు.
అధికారులు మరియు ప్రజాప్రతినిధులు   సమన్వయంతో పనిచేసి చివరి మనిషి వరకు 100% వ్యాక్సిన్ అందించాలని  మంత్రి తెలిపారు.  ప్రతి గ్రామం మరియు మున్సిపల్ వార్డుల పరిధిలో  ప్రత్యేక వ్యాక్సినేషన్  కేంద్రాల నిర్వహణ  పై  అవగాహన కల్పించాలని, ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా  స్థానిక ప్రజాప్రతినిధులు  పనిచేయాలని  మంత్రి ఆదేశించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తరువాత కరోనా వచ్చే అవకాశాలు  చాలా వరకు తగ్గిపోతాయని, వ్యాక్సినేషన్ అనంతరం  కరోనా వచ్చినప్పటికి ప్రాణాలకు ఎలాంటి అపాయం ఉండదని,  ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని మంత్రి ఆదేశించారు.
ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాల వద్ద   తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న  క్యాంపు అని తెలిసే విధంగా సీఎం కేసిఆర్ ఫోటోతో  ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని  మంత్రి కలెక్టర్ కు సూచించారు.   కోరుట్లలో వైద్యాధికారి సరిగ్గా స్పందించడం లేదని  మున్సిపల్  చైర్ పర్సన్   ఫిర్యాదు పరిశీలించి పరిష్కరించాలని  మంత్రి సూచించారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలోనే అధికంగా వ్యాక్సినేషన్ అందిస్తున్న జిల్లాగా  జగిత్యాల నిలిచినందుకు మంత్రి అధికారులను అభినందిస్తూ, ఈ స్పూర్తి   ఇదే విధంగా కొనసాగించాలని  తెలిపారు. జిల్లా కలెక్టర్  జి. రవి మాట్లాడుతూ  జిల్లాలో  100 శాతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించేందుకు 274 (134 పట్టణ, 140 గ్రామీణ) బృందాలతో  ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసామని  తెలిపారు.  జిల్లాలో 653480 మంది  ప్రజలు 18 సంవత్సరాల పై వయస్సు వారు ఉన్నారని, వీరిలో 42.8% మందికి  మొదటి డోసు, 17% మందికి రెండవ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసామని తెలిపారు.  సెప్టెంబర్ 16న నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 19934 మందికి,  17 న నిర్వహించిన డ్రైవ్ లో 19546 మందికి వ్యాక్సినేషన్  అందించామని  తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో వ్యాక్సినేషన్ కు  అధిక  స్పందన  రావడంతో గ్రామీణ ప్రాంతంలో 140 సబ్ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసిన ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి రోజుకు 150 డోసులు  వ్యాక్సిన్ అందిస్తున్నామని, పట్టణంలోని ప్రతి వార్డులో రోజు 25 డోసులు  వ్యాక్సిన్ అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.   సబ్ సెంటర్ పరిధిలో ఉన్న గ్రామాలో  షెడ్యూల్ ప్రకారం  ప్రత్యేక వ్యాక్సిన్ క్యాంపులు నిర్వహిస్తామని,   సదరు షెడ్యుల్ సంబంధిత సమాచారం స్థానిక ప్రజాప్రతినిధులందరికి అందించాలని కలెక్టర్ సూచించారు.   పట్టణ ప్రాంతంలో మెప్మా వారితో,గ్రామీణ ప్రాంతంలో ఐకేపి, అంగన్ వాడి , ఆశాలతో బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికి  తిరిగి  వ్యాక్సినేషన్ కాని వారిని గుర్తిస్తున్నామని,  ప్రతి ఇంటి  పై వ్యాక్సినేషన్  స్టికర్ అతికించాలని  కలెక్టర్ సూచించారు.
జడ్పీ చైర్ పర్సన్  దావ వసంత మాట్లాడుతూ  జిల్లాలో ఏర్పాటు చేసిన 274 ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా  వ్యాక్సినేషన్  కార్యక్రమం పకడ్భందిగా నిర్వహిస్తున్నామని, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని  తెలిపారు.   జిల్లాలో 100 శాతం ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో సంపూర్ణ  సహకారం అందిస్తామని  తెలిపారు.  జిల్లాలోని వివిధ గ్రామాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంపుల  షెడ్యూల్ వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులందరికి అందించాలని  ఆమె అధికారులకు తెలియచేసారు.

కోరుట్ల శాసనసభ్యులు  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ  సీఎం కేసిఆర్ ఆదేశాలతో నిర్వహిస్తున్న  ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంపులు  విజయవంతంగా నడుస్తున్నాయని, ప్రజలందరికి వ్యాక్సిన్ అందించడానికి కృషి చేస్తామని  తెలిపారు.   జగిత్యాల ఎమ్మెల్యే  డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ  ప్రత్యేక వ్యాక్సినేషన్ ద్వారా ప్రజల్లో మంచి స్పందన ఉన్నదని, కేంద్రాల వద్ద  రాష్ట్ర  ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులు  అని సూచించే విధంగా సీఎం కేసిఆర్  ఫోటో ఏర్పాటు చేయాలని  సూచించారు.
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణీ మాట్లాడుతూ  పట్టణంలో  ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా కౌన్సిలర్లతో కలిసి  క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని  తెలిపారు.  రాయికల్ మున్సిపల్ చైర్మన్  గోడ హనుమాన్ మాట్లాడుతూ  దుర్గాకాశి నగర్ ప్రాంతంలో సైతం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయాలని  కోరగా,  మున్సిపాల్టీలో ఏర్పాటు చేసిన క్యాంపులో నుంచి సర్థుబాటు చేస్తామని  కలెక్టర్ తెలిపారు.   ప్రస్తుతం వైరల్ ఫీవర్ వచ్చీన వారికి వ్యాక్సినేషన్  ప్రక్రియ  వివరించాల్సిందిగా  కోరగా,  వైరల్ ఫీవర్ ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదని,  జ్వరం తగ్గినవెంటనే  వ్యాక్సినేషన్ అందిస్తున్నామని  తెలిపారు.  కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్   వైద్యాదికారి సరిగ్గా స్పందించడం లేదని  తెలిపారు.జెడ్పిటిసిలు,ఎం.పి.పిలు,ఎం.పి.టి.సిలు,  మండల ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు,  సంబంధిత అధికారులు  తదితరులు ఈ వీడియో  కాన్పరెన్సులో  పాల్గోన్నారు.

Previous articleపోడు భూములపై సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ
Next articleగణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో ఆర్టీసీ 565 ప్రత్యేక బస్సులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here