పత్తికొండ
పత్తికొండలో బీసీ బాలికల హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ. కాంపౌండ్ వాల్ నిర్మాణం, బాత్రూంల నిర్మాణం, వంటగది మరమ్మత్తులు చేయించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసిన వార్డెన్, పనులు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పిల్లలకు రుచికరమైన భోజనం పెట్టాలని మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్డెన్ ని హెచ్చరించారు. తనిఖీ లో ఎంపీపీ నారాయణ దాసు, వైస్ ఎంపీపీ కొత్తపల్లి బలరాముడు, వైఎస్సార్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరంగడు, ఉప్పర సంఘం రాష్ట్ర డైరెక్టర్ బజారప్ప, కో ఆప్షన్ నెంబర్ కారుమంచి నజీర్, వైయస్సార్ పార్టీ యువ నాయకులు పందికోన నాగరాజు, హోసూర్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.