Home తెలంగాణ మహిళకు రక్తదానం చేసిన యువకుడు

మహిళకు రక్తదానం చేసిన యువకుడు

285
0

కామారెడ్డి, సెప్టెంబర్ 22
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గంలో సదాశివనగర్ మండలం తుక్కోజి వాడి గ్రామానికి  చెందిన రాణి (35)అనే గర్భిణికి  మైత్రి వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ‘బి’నెగిటివ్ రక్తం అవసరం పడింది. మహిళ బంధువులు బాలు ను సంప్రదించారు.  చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్ ను పిలిపించారు. ఆయన మానవతా దృక్పథంతో రక్తదానం చేసి గర్భిణి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ,  గత 13 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి రక్తం అవసరం అయినప్పుడు ఎల్లవేళలా కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా సహకరిస్తామని, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినట్లయితే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చుని అన్నారు. రక్తదానం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చునని, రక్తదానం చేయాలనుకున్నవారు
9492874006 కి సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్, లక్ష్మణ్, రాజు, వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ పాల్గొనడం జరిగింది.

Previous articleనిఘా నీడలో ముస్త్యాల సుందిల్ల ఫైవ్ ఏ చెక్ పోస్ట్ – సొంత ఖర్చులతో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ – సర్పంచ్ కృషి అభినందనీయం – గోదావరిఖని 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు
Next articleసెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల – దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి – టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here