మెదక్
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో రావేల్లి లో కాలిన గాయాలతో పడి ఉన్న చేగుంట మండలం మక్క రాజుపేట కు చెందిన అనిల్ గౌడ్(26) తొంబైయి శాతానికి సైగా శరీరం కాలిపోవడంతో అతన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. బాధితుడిని ఎవరైనా తీసుకొచ్చి హత్యకు ప్రయత్నించారా లేక తనే ఆత్మహత్యకు ప్రయత్నించాడా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా అతని పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.