Home వార్తలు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎస్‌వీసీ ఎల్ఎల్‌పీ సంయుక్తంగా భారీ చిత్రాల నిర్మాణం.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎస్‌వీసీ ఎల్ఎల్‌పీ సంయుక్తంగా భారీ చిత్రాల నిర్మాణం.

108
0

అభిషేక్ గ్రూప్ చైర్మన్ తేజ్ నారాయణ్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రకటన చేశారు. హైద్రాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలైన రెండు కుటుంబాలు కలిసి అద్భుతమైన చిత్రాలను నిర్మించనున్నారు.  ఎషియన్ సినిమాస్ గ్రూప్ చైర్మన్ నారాయణ్ దాస్ కే నారంగ్ ఆధ్వర్యంలో గొప్ప చిత్రాలు రాబోతోన్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి ( ఏషియన్ గ్రూప్ అనుబంధ సంస్థ). సునీల్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా అద్భుతమైన ప్రాజెక్ట్‌లను నిర్మించబోతోన్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎస్‌వీసి ఎల్ఎల్‌పి ఎప్పుడూ కూడా మంచి చిత్రాలనే నిర్మించేందుకు ప్రయత్నించారు. యంగ్ స్టర్స్‌తో ఎక్కువగా వీరు సినిమాలను తీశారు. ఇకపై ఈ రెండు సంస్థలు కలిసి భారీ చిత్రాలను నిర్మించేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు. ఇలా యంగ్ అండ్ సీనియర్ నిర్మాతలు కలవడంతో  సరికొత్త ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ పస్ల కమర్షియల్  హంగులతో భారీ చిత్రాలు రాబోతోన్నట్టు కనిపిస్తోంది.

Previous article100 పాటలు, గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన
Next articleసమ్మక్క జాతర ఏర్పాట్లపై సమీక్ష మంత్రి సత్యవతి రాథోడ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here