జగిత్యాల నవంబర్ 15
జగిత్యాల ఏబీవీపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించి అనంతరం డీఈవో ఒక వినతి పత్రంను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాపాక సాయి విభాగ్ ఎస్ ఎఫ్ డి కన్వీనర్ మదం మల్లేష్ ,నగర కార్యదర్శి అలకొండ సాయి, నగర జోనల్ ఇంచార్జీ నందు తో పాటు కార్యకర్తలు కార్తీక్ శ్రావణ్ సాయి భారత్ మహేష్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.