గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం నాడు ఘటనాస్థలిని డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. సమీపంలోని కోల్డ్ స్టోరేజీలో పనిచేస్తున్న ఒడిశా కార్మికులను పోలీసులు విచారించారు. అత్యాచార ఘటన నేపథ్యంలో వారి వద్ద ఉన్న వివరాలను ఆరా తీస్తున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలిని వైద్యపరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై బైక్పై వస్తుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్న విషయంతెలిసిందే. బైక్పై వస్తున్న దంపతులను కొందరు దుండగులు అడ్డగించి భర్తపై దాడి చేశారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు, కేసు నమోదు విషయంలో పోలీసులు వెనువెంటనే స్పందించారని సత్తెనపల్లి డీఎస్పీ వివరణ ఇచ్చారు.