Home ఆంధ్రప్రదేశ్ అక్రిడేషన్ కార్డులు తొందరగా మంజూరు చేయాలి అంగీకరించిన జిల్లా కలెక్టర్

అక్రిడేషన్ కార్డులు తొందరగా మంజూరు చేయాలి అంగీకరించిన జిల్లా కలెక్టర్

293
0

కర్నూలు
తొలివిడత అక్రిడేషన్ కమిటీ సమావేశంలో పెద్ద పత్రికలు మరియు శాటిలైట్ ఛానల్స్ కు  మాత్రమే అక్రిడేషన్లు మంజూరు చేశారని స్థానిక పత్రికలకు అక్రిడేషన్ మంజూరు చేయనందువలన జర్నలిస్టులందరూ  తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ కు శుక్రవారం  రాయలసీమ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున నివేదిక ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ వాస్తవానికి ఈనెల ఏడో తారీఖు అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నామని త్వరలో అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా రెగ్యులారిటీ కలిగి ఉన్న పత్రికలకు జిఎస్టి కానీ న్యూస్ పేపర్ ఓన్ ప్రింట్ ఉన్న ప్రింటర్స్ పేరుతో న్యూస్ ప్రింట్ కొన్నట్లు మూడు నెలల బిల్లంలు ఉన్నాకూడా 142 జీవోను అమలు చేస్తామని  అక్రిడేషన్ కమిటీ కన్వీనర్ తెలిపినట్లు జిల్లా కలెక్టర్ గారికి జర్నలిస్టులు తెలిపారు. ఆ ప్రకారమే అందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూల్ లో  సమాచార శాఖ డీడీ వింత పోకడలతో ముందుగానే మూడు నెలల పేపర్ ఉండాలంటూ రెగ్యులర్ ఈ పేపర్ లను ,ఇన్  రెగ్యులర్ పేపర్లను హెచ్చరిస్తుంది. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందిస్తూ మిగతా జిల్లాల్లో ఎలా ఉంటే అలాగే చేద్దాం అన్నారు. దీంతో జర్నలిస్టులు అందరూ కలెక్టర్ను కు  కృతజ్ఞతలు తెలిపారు.

Previous articleకరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేసేలా వైద్యాధికారులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
Next articleఏరియా హాస్పిటల్ లో స్వచ్చత పఖ్ వాడా కార్యక్రమం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here