విశాఖపట్నం
విశాఖ శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వా మి వారి దేవాలయములో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత గోవింద రాజు స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధీష్టింపజెసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి సహస్ర నామార్చన, నిత్య కళ్యాణం కమనీయంగా జరిపించిన అనంతరం వెండి గరుడ వాహనము పై స్వామి వార్ని ఆదీష్టింపజేసి వైభవంగా శ్రీ స్వామి వారి గరుడ వాహన సేవను నిర్వహించారు. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు