ఎమ్మిగనూరు
పట్టణంలో కండిషన్ లో లేని బస్సుల పై చర్యలు తీసుకోవాలని పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ గారికి వినతి పత్రం అందజేశారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ
ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రవేట్,కార్పోరేట్ పాఠశాలలు అనుమతులు లేకుండానే ప్రైవేటు బస్సులను వినియోగిస్తున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు పాఠశాలకు తోత్తులు గా మారారు అని కండిషన్ లేని బస్సుల వల్ల విద్యార్థులకు ప్రమాదాలు జరిగితే విద్యార్థి సంఘాలు గా ఊరుకోబోమని హెచ్చరించారు తక్షణమే ఫిట్నెస్ లేకుండా నడపబడుతున్న భాష్యం,రవీంద్ర భారతి, శ్రీ చైతన్య ,కస్తూరి పాఠశాలల బస్సుల పై లైసెన్స్ లేని డ్రైవర్లతో బస్సులు నడుపుతూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నా ఇలాంటి పాఠశాలల పై తక్షణమే ఎంక్వయిరీ నిర్వహించి బస్సులను సీజ్ చేయవలసిందిగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఉదయ్ బిసి ఎస్టి మైనారిటీ జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్ లు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సందీప్ ఆర్యన్ చందు తదితరులు పాల్గొన్నారు.