Home తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మనుగడకు కార్యకర్తలే ముఖ్యం తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ ఘన తే...

కాంగ్రెస్ పార్టీ మనుగడకు కార్యకర్తలే ముఖ్యం తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ ఘన తే కార్పోరేట్ల కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు అప్పులు, లిక్కర్ అమ్మకాల్లో తెలంగాణా ముందంజ కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

183
0

జగిత్యాల,నవంబర్ 30
కార్యకర్తల సహకారం లేకుండా ఏ రాజకీయ పార్టీ తన లక్ష్యాన్ని చేరుకోలేదని చెబుతూ  కాంగ్రెస్ పార్టీ మనుగడకు కార్యకర్తలే ముఖ్యమని మాజీమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
మంగళవారం జగిత్యాలలోని

పొన్నాల గార్డెన్లో  జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మొహాన్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింధి. డిజిటల్ ఆన్ లైన్ సిస్టం ద్వార  పార్టి  సభ్యత్వ నమోదు గురించి కార్యకర్తలకు అవగాహన కల్పించగా   ముఖ్య అతిథులుగా

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , ఏఐసిసి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దీపక్ జైన్ లు పాల్గొన్నారు.
ఈ  సంధర్బంగా దీపక్ జైన్ మాట్లాడుతూ
ఇంటింటికీ వెళ్ళి కార్యకర్తలు, పార్టీ అభిమానులను  కలవడమే లక్ష్యంగా డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమం ఏర్పాటు

చేయడం జరిగిందన్నారు.136 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం ప్రతీ కార్యకర్త అదృష్టంగా భావించాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతమే లక్ష్యంగా డిజిటల్ సభ్యత్వ

నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు.
పార్టీ విజయంలో పార్టీ మేనిఫెస్టో , అభ్యర్థి 50శాతమైతే పార్టీ కార్యకర్తల కృషి యాభై శాతం ఉంటుందని తెలిపారు.అమలు చేయగలిగే హామీలను  మాత్రమే  మేనిఫెస్టోలో పొందుపరచడం కాంగ్రెస్ పార్టీ

విధానమన్నారు.
భారత మాతను  దాస్య శృంఖలాలను విడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ ఘనతేనని పేర్కొంటూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో రాజకీయంగా నష్టం కలుగుతుందని తెలిసీ

రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాంధీ కే దక్కిందని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానంతోనే వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ పెంపు జరిగిందన్నారు.
హక్కుల సాధనలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు    అండగా

ఉంటుందన్నారు.తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉన్న పేదలకు ఉచిత కార్పోరేట్ వైద్యం అందిచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, అలాగే 104, 108 వాహనాలతో ఆస్పత్రి సేవలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టని జీవన్ రెడ్డి పార్టి చేసిన కార్యక్రమాలను

కార్యకర్తలకు వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్నాయని ఆయన విమర్శించారు.చమురు ధరలపై ప్రభుత్వం పెంచింది కొండంత, తగ్గించింది గోరంతని ఆరోపించారు.
ఉద్యమ నాయకుడని ఓటేసిన ప్రజలను కేసీఆర్ మోసం

చేశారని,ఏడేళ్ళ  పాలనలో  టిఆర్ఎస్ పార్టీ ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
బాలిక సంరక్షణ పథకాన్ని నిలపివేసిన టీఆరెఎస్ ప్రభుత్వమని,ఏడున్నరేల్లయినా పేదలకు ఒక్క ఇళ్ళయినా కట్టలేదని,రైతులకు శఠగోపం

పెట్టిన ఘనత కేసీఆర్ ధెనని,రైతుల నోట్లో మన్ను గొడుతున్న కేసీఆర్ కు రైతుల ఉసురుతగలక తప్పదని హెచ్చరిస్తూ,రైతాంగాన్ని ఆదుకోవడానికి 5 వేల కోట్లు కెటాయించలేరా అని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
.బిజేపి విధానాలను

అమలు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వ పాలన సాగుతోందని,  మోదీ ఆలోచనా విధానాన్ని తూచా తప్పకుండ అమలు చేస్తున్న సిఎం కేసిఆర్ కు ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు మరణిస్తే  లక్ష రూపాయలు

ఇచ్చారని,గల్ఫ్ కార్మికులు మరణిస్తే 5లక్షల పరిహారం ఇస్తానన్న కేసీఆర్ హామీ ఎనిమిదేళ్ళయినా అమలుకు నోచుకోలేదని,అలాగే  మైనారిటీ 12శాతం హామీ అమలుకు నోచుకోలేదని చెభుతూ హామీల అమలులో ప్రభుత్వం విపలమైంధన్నారు.

ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేని జీవన్ రెడ్డి చెప్పారూ.
అప్పులు, లిక్కర్ అమ్మకాల్లో  తెలంగాణా ముందంజలో ఉందని,ఆదాయ పెంపు లక్ష్యంగా బెల్టు షాపులను ప్రభుత్వం  ప్రోత్సహిస్తూ ప్రజలను తాగు బోతులను

చేస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణాకు పట్టిన కేసీఆర్ చీడను వదిలించడం  మహిళలతోనే సాద్యమని జ్యొస్యం చెప్పారూ.
కాంగ్రెస్ అదికారంలోకి వచ్చాక కళ్యాణలక్ష్మీతో పాటు ప్రతి కొత్త జంటకు ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయలిస్తామని చెప్పారు.

వంద స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రావడం ఖాయమని చెభుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రావాలన్నదే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్,టీపీసీసీ

కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డి, మన్సూర్ అలీ,    కల్లెపెల్లి దుర్గయ్య, నక్క జీవన్, గాజుల రాజేందర్, గాజంగి నందయ్య, గుండా మధు, రవిందర్ రావు ,జున్ను రాజేందర్,

మన్సూర్ ఆలీ, కొత్త మోహన్, కోండ్ర జగన్,  పుప్పాల అశోక్, బింగి రవి, చిట్ల అంజన్న ,  ముంజాల రఘువీర్ గౌడ్ ,తోట నరేశ్, మున్నా,నేహాల్,కమల్ , పులి రామ్,అల్లాల అనిత రమేశ్ రావు,తాడేపూ రాధ ,అనిత, చిట్ల లత, నాగిరెడ్డి  రజీత

తదితరులు పాల్గొన్నారు.

Previous articleసుదర్శన హోమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌ రావు
Next articleవరద బాధిత ప్రాంతాల్లో సామాజిక తనిఖీ త్వరితగతిన పూర్తి చేయండి… రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here