తిరుపతి
ఆ ప్రాంతంలో దాదాపు 30 మంది వరద నీటిలో చిక్కుకున్నారు. స్వర్ణముఖి నదికి సమీపంలో ఉండటం మూలాన, నదిలో వరద పోటెత్తి, సమీపంలోని ఇళ్లపై ప్రవహించింది.. ప్రకృతి బీభత్సం ఆపగలమా… ఆ ఇళ్ళలోని వారందరూ రూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. వారు తమ మొబైల్ ఫోన్ నుంచి తిరుచానూరు పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. ఎవరో ఒకరు కాపాడుతారని ఎదురుచూసారు. నైట్ బీట్ లో వున్నా కానిస్టేబుల్ ప్రసాద్ కు సమాచారం అందింది. బాధితుల లొకేషన్ గుర్తించడానికి ప్రసాద్ చాలా కష్టపడ్డారు. చివరకు స్థానికుల సహాయంతో తాడును ఉపయోగించి వారిని కాపాడారు.
ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు, హుటాహుటిన రేణిగుంట దాటుకుని గాజులమండ్యం మీదుగా పాడిపేట వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతానికి రావడానికి వారికి మార్గం లేదు. ఆ ప్రాంతంలో ఉన్న స్వర్ణముఖి నది పై నిర్మించిన బ్రిడ్జి వరద కొట్టుకుపోయింది. దీంతో యస్.పి అక్కడి నుంచే అవతలివైపు ఉన్న సిబ్బందికి సూచనలు ఇస్తూ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.
శుక్రవారం నాడు అక్కడికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాగానే బాధితులంతా అయనను కలిసారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి కానిస్టేబుల్ ప్రసాదు తో పాటు శ్రీనివాసులరెడ్డి, రెడ్డప్ప, మధు లను కూడా సన్మానించారు. మనస్ఫూర్తిగా అభినందించారు.
Home ఆంధ్రప్రదేశ్ సాహసమే శ్వాసగా…ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న కానిస్టేబుల్ ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్న ప్రసాద్