Home సినిమాలు ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్‌, సంపత్ నంది, శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ చిత్రం ‘సీటీమార్‌’ సన్సార్ పూర్తి...

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్‌, సంపత్ నంది, శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ చిత్రం ‘సీటీమార్‌’ సన్సార్ పూర్తి వినాయక చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10 రిలీజ్‌కు స‌ర్వం సిద్ధం

100
0

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా సెన్సార్ పూర్తి కావ‌డంతో సీటీమార్ థియేట‌ర్స్ సంద‌డికి సర్వం సిద్ధ‌మైన‌ట్టే…ఈ సంద‌ర్భంగా..
చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘ఎగ్రెసివ్ స్టార్‌, యాక్ష‌న్ హీరో అయిన గోపీచంద్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా మా శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్‌’  సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.  ఇక సినిమా రిలీజ్ కావ‌డ‌మే తరువాయి. పండ‌గ‌కు కుటుంబం అంతా క‌లిసి ఎలాంటి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న సినిమాను చూడాల‌నుకుంటారో అలాంటి సినిమానే మా సీటీమార్‌. వినాయ‌క చ‌వితి కానుకగా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌, అప్స‌రా రాణి చేసిన స్పెష‌ల్ సాంగ్ స్పెష‌ల్ సాంగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ సంపత్ నందిగారు మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను ప‌ర్‌ఫెక్ట్స్‌గా మిక్స్ చేసి ప్ర‌తి సీన్ గ్రాండియ‌ర్‌గా, ఎగ్జయిట్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల‌న అల‌రించేలా డైరెక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 10న థియేట‌ర్స్‌లో వ‌స్తున్న మా సీటీమార్ చిత్రం హండ్రెడ్ ప‌ర్సెంట్ ఆడియెన్స్‌కు మంచి ఫీస్ట్‌లా ఉంటుంది’’ అన్నారు.
న‌టీన‌టులు: గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించిన‌ ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది.

Previous articleవాహనదారులు నుండి అక్రమ వసూళ్లు. వసూళ్లకు అడ్డాగా నాయుడుపేట . పూతలపట్టు బైపాస్ సర్కిల్ ప్రజలను నిలువుగా దోచుకుంటున్న వైనం దోచిన వారు తోచినట్టుగా- నామమాత్రంగా సీసీ కెమెరాలు పట్టించుకోని సంబంధిత అధికారులు
Next articleనంద్యాల పట్టణంలో వార్డ్ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here