న్యూఢిల్లీ సెప్టెంబర్ 23
మానవాళికి వాయు కాలుష్యం అనేది అతిపెద్ద పర్యావరణ ముప్పుల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏటా 70 లక్షల మంది అకాల మరణం పొందుతున్నారని తన తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. గాలి నాణ్యతను పెంచడం పర్యావరణ మార్పుకు అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుంది. అయితే అది జరగాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించాల్సి ఉంటుంది అని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.ఏటా 70 లక్షల మందిని పొట్టనబెట్టుకుంటున్న వాయు కాలుష్యం.. ఎన్నో కోట్ల మంది ఆరోగ్యవంతమైన జీవితాలపై ప్రభావం చూపుతోంది. పిల్లల్లో ఈ కాలుష్యం ఊపిరితిత్తుల ఎదుగుదలను, వాటి పనితీరును ప్రభావితం చేసి శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లను పెంచుతోంది అని ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో తేల్చి చెప్పింది. గాలి నాణ్యతకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా 2005 తర్వాత తొలిసారి మార్చింది. కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.