కర్నూలు
కడప జిల్లాలో దువ్వూర్ మండలం భూ వివాదంలో మనస్థాపం చెంది అక్బర్ బాషా ఆయన కుటుంబ సభ్యులు మరోసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసారు. గతంతో అక్బర్ భాష సెల్ఫీ వీడియో రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన పొలం వైసీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడని గతంలో అక్బర్ బాష ఆరోపణలు చేసాడు. సోమవారం రాత్రి అక్బర్ భాష ప్రస్తుతం చాగలమర్రి మండలంలో కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసాడు. వారి పరిస్థితి విషమంగా వుండడంతో ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోలేదని మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసానని అక్బర్ బాష చెప్పాడు. అక్బర్ భాష పాటు తన భార్య ఇద్దరు పిల్లలు కలసి పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసారు.