ముంబై అక్టోబర్ 13
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపద్యం లో కాషాయ పార్టీని అడ్డుకునేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ పిలుపునిచ్చారు. యూపీ-2022 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ పొత్తుతో పోటీ చేస్తామని ఇప్పటికే ఎన్‌సీపీ ప్రకటించింది. ఓట్ల విభజనను సాధ్యమైనంత వరకు తగ్గించేలా చూడడం చాలా ముఖ్యమని, ఇందుకు బీజేపీయేతర పార్టీలు కలిసిరావాలన్నారు. లఖింపూర్ ఖేరి ఘటనపై స్పందిస్తూ.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయని.. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీతో సహా కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలు లక్ష్యంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు.