నంద్యాల నవంబర్ 15
నంద్యాల మండలం లోని జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి అని నంద్యాల డివిజినల్ డెవలప్మెంట్ అధికారి భాస్కర్ అన్నారు.
నంద్యాల డివిజినల్ డెవలప్మెంట్ అధికారి భాస్కర్ మాట్లాడుతూ నంద్యాల మండలం లోని జెడ్ పి టి సి ఎన్నికల ప్రక్రియ 16వ తేదీన17 గ్రామపంచాయతీల లోని 47 పోలింగ్ కేంద్రాల ద్వారా పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ కు ఎనిమిది రూట్లు. నాలుగు జోన్లు గా విభజించి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు గై కుంటున్నాము అన్నారు. మండలంలో సమస్యాత్మకమైన కానాల. చాబోలు. ఐలూరు 1.2. మరియు అతి సమస్యాత్మకమైన పులిమద్ది. పోలూరు. కొత్తపల్లి గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారించి పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
47 పోలింగ్ కేంద్రాల్లో21444 మంది పురుషులు22394 మంది స్త్రీలు 5 మంది ఇతరులు మొత్తం43. 843 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు .
ఎన్నికల నిర్వహణ కొరకు నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణము లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఎన్నికల నిర్వహణ సిబ్బంది కి ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ ను ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపడం జరిగిందన్నారు .
Home ఆంధ్రప్రదేశ్ నంద్యాల మండలం లోని జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి నంద్యాల డివిజినల్ డెవలప్మెంట్...