పెద్దపల్లి నవంబర్ 30
జిల్లాలోనే మరో 2 వైన్ షాప్ లను లాటరీ ద్వారా కేటాయించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో 2 వైన్ షాప్ కేటాయింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. లాటరీ పద్ధతి ద్వారా వైన్ షాప్ లను పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వైన్ షాప్ లో కేటాయించే ప్రక్రియను నిబంధనల మేరకు వీడియో గ్రఫీ చేస్తున్నామని అన్నారు. రామగుండం లోని మార్కెట్ ఏరియా షాపు నెం.49 (ఎస్సీ) 19 దరఖాస్తులు, 5 ఇంక్లైన్ తిలక్ నగర్(గౌడ) 19 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో నుంచి షాపులను పారదర్శకంగా లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అబ్కారీ శాఖ సూపరిండెంట్ రవి కుమార్, సిఐలు వినోద్ రాథోడ్, రమేష్ , సబ్ ఇన్స్పెక్టర్లు విజయభాస్కర్,రఘు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.