Home తెలంగాణ లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు

లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు

125
0

మెదక్‌ నవంబర్ 8
2021-23 నూతన ఆబ్కారీ విధానంలో రిటైల్ మద్యం దుకాణాల ఎంపికను సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. ఈ విధానంలో ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులకు రిజర్వు అయిన వాటితో పాటు ఇతర గిరిజనులకు మరో 5 శాతం, ఎస్సీలకు 10, గౌడలకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అందుకనుగుణంగా దుకాణాల కేటాయింపు కమిటీ సభ్యులైన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌ అధికారి సమక్షంలో జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ రమేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్ లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను ఎంపిక చేశారు.జిల్లాలో మొత్తం 49 వైన్ షాపులకు గాను ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు 30 శాతం రిజర్వేషన్ గా 16 దుకాణాల కేటాయింపుకు రొటేషన్ (సైకిల్ సిస్టం ) పద్ధతిలో ఎస్టీ,ఎస్సీ, గౌడలకు వరుసగా లాటరీ తీసి దుకాణాలు కేటాయించారు. 2019-21 వరకు అమలులో ఉన్న ఆబ్కారీ విధానం గత నెలలో ముగియగా ప్రభుత్వం ఈ నెల వరకు లైసెన్స్ పొడిగించింది.

Previous articleత‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు.. నీట మునిగిన లోత‌ట్టు ప్రాంతాలు
Next articleఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం స్టేటస్‌ రిపోర్ట్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here