Home జాతీయ వార్తలు ప్ర‌ధాని మోదీ స‌లహాదారుగా అమిత్ ఖ‌రే నియామకం

ప్ర‌ధాని మోదీ స‌లహాదారుగా అమిత్ ఖ‌రే నియామకం

136
0

న్యూఢిల్లీ అక్టోబర్ 12
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌లహాదారుగా స‌మాచార‌, ప్ర‌సార శాఖ మాజీ కార్య‌ద‌ర్శి అమిత్ ఖ‌రేను మంగ‌ళవారం నియ‌మించారు. ప్ర‌ధాని మంత్రి స‌ల‌హాదారులుగా పీకే సిన్హా, అమ‌ర్‌జీత్ సిన్హా ఈ ఏడాది త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానంలో అమిత్ ఖ‌రే.. పీఎంవోలోకి వెళ్ల‌నున్నారు.  ఈయ‌న 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉన్న‌త విద్య శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసి సెప్టెంబ‌ర్ 30న రిటైర్ అయ్యారు. స‌మర్థ‌వంత‌మైన‌, క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన బ్యూరోక్రాట్‌గా అమిత్‌కు పేరుంది. ఉన్న‌త విద్యాశాఖ కార్య‌ద‌ర్శిగా గ‌తేడాది కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావ‌డంతోపాటు స‌మాచార‌, ప్ర‌సార శాఖ కార్య‌ద‌ర్శిగా డిజిట‌ల్ మీడియా నియంత్ర‌ణ‌ల‌కు సంబంధించి కూడా కీల‌క మార్పులు తీసుకొచ్చిన ఘ‌న‌త అమిత్ ఖ‌రే సొంతం. పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని అమిత్‌కు పేరుంది.

Previous articleమాజీ రోటరీ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి లకు ఘనంగా సన్మానం
Next articleమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో స్టాండప్ కామెడీతో నవ్వించడానికి వచ్చేస్తున్న విభ (పూజా హెగ్డే) కు జన్మదిన శుభాకాంక్షలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here