న్యూఢిల్లీ నవంబర్ 2
హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రతి రౌండ్ కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ దూసుకుపోతుంది. టీఆర్‌ఎస్ కేవలం రెండు రౌండ్లలోనే ఆధిక్యం కనబర్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఫలితాలపై అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని బండి సంజయ్ అమిత్‌షాకు తెలిపారు. ఇక హుజూరాబాద్ ఫలితాలపై అమిత్ షా టీం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.కాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజూరాబాద్ ఫలితాలపై సంబరాలు చేసుకుంటున్నారు కార్యకర్తలు. బాణసంచా, డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో కార్యకర్తల సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్స్ పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు బీజేపీ శ్రేణులు