Home జాతీయ వార్తలు తిరుపతి వేదికగా 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా బేటి శాంతి భద్రతలతో పాటు...

తిరుపతి వేదికగా 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా బేటి శాంతి భద్రతలతో పాటు అన్నికీలకమైన అంశాల మీద కూలంకషంగా చర్చ

118
0

న్యూ ఢిల్లీ నవంబర్ 5
కేంద్ర హోం మంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. దానికి ముహూర్తం ఈ నెల 14న. ఇక వేదిక అతి పవిత్రమైన తిరుపతి నగరం. అంటే ఏపీలోనే అమిత్ షా సౌత్ కి చెందిన అయిదు రాష్ట్రాల సీఎంలతో మీట్ అవుతారు అన్న మాట. ఇంతకీ ఈ సమావేశం దేనికంటే సదరన్ జోనల్ కౌన్సిల్ పేరిట అయిదు రాష్ట్రాలలో శాంతి భద్రతల నుంచి అన్నికీలకమైన అంశాల మీద కూలంకషంగా చర్చించనున్నట్లు సమాచారం, దీనితో ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఏపీలో జరుగుతోంది. దాంతో అందరి చూపు ఏపీ సర్కార్ మీద ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ మీటింగులో జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారు. ఆయన అజెండా ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే ఏపీ సర్కార్ విభజన హామీలు ప్రత్యేక హోదా మీద పట్టు బట్టే అవకాశం ఉంది అంటున్నారు. అదే విధంగా తెలంగాణా ప్రభుత్వంతో ఉన్న పేచీలను కూడా అమిత్ షా ముందు పెట్టి పరిష్కారం కోరనుందిట. దాంతో తెలంగాణా సర్కార్ కూడా అలెర్ట్ అయింది. మేము కూడా అమిత్ షా ముందు మా వాదనలు గట్టిగా వినిపిస్తామని అంటున్నరు.అంటే ఏపీ తెలంగాణాల మధ్య చాలా కాలంగా అనేక అంశాల మీద ఉన్న పంచాయతీ కాస్తా అమిత్ షా ముందుకు రానుంది అన్న మాట. మరి అమిత్ షా ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారు. ఏ విధంగా తీర్పు చెబుతారు అన్నది చూడాలి. ఆ మాటకు వస్తే ఈ రెండు రాష్ట్రాల సమస్యల మీద చర్చితే తీరుబాటు కేంద్ర హోం మంత్రికి ఉంటుందా అన్న ప్రశ్న కూడా ఉంది. కేంద్రం తాను అనుకున్న అజెండా మెరకు నిర్వహించే సమావేశం ఇది. దాంతో పాటు సీఎం లు ఎవరైనా కోరితే వారితో భేటీకి అమిత్ షా అవకాశం ఇవ్వవచ్చు. అపుడు ఏమైనా విన్నపాలు చేసుకునే వీలుంటుంది. అంతే తప్ప దాని మీద ఏదీ సీరియస్ గా పని జరిగిపోతుందా అంటే ఇప్పటికైతే చెప్పలేమనే అంటున్నారు. జగన్ ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా మీద వినతులు ఇచ్చారు. మరి వాటి మీద కేంద్రం ఏం చేసింది. ఏమి పట్టించుకుంది. ఇపుడు కూడా అంతేనా అంటే ఏమో. అయితే ఆశావహంగా ఉండడంలో తప్పు లేదు కానీ మరీ అత్యాశలకు పోవడం మంచిది కాదు అని గత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Previous articleదేశంలో గ‌ణ‌నీయంగా త‌గ్గిన వంట నూనెల ధ‌ర‌లు
Next articleఫిబ్రవరిలో విడుదల కానున్న శర్వానంద్, శ్రీ కార్తీక్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘ఒకే ఒక జీవితం’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here